ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పూర్తిగా ఉచితంగా 900కు పైగా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. 95523 00009 నంబర్‌ను సేవ్ చేసి వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలు పొందొచ్చు. ఆదాయం, కుల, ఓబీసీ సర్టిఫికెట్లు, కరెంట్, నీటి, ఆస్తి పన్నుల చెల్లింపు, ఆర్టీసీ టికెట్లు, ఆలయ దర్శనాలు, భూ రికార్డులు తదితర సేవలు ఇంటి నుంచే పొందవచ్చు. ఇప్పటివరకు 50 లక్షల మంది 2.5 కోట్ల సేవలు వినియోగించుకున్నారు.