ఇనుప ఖనిజంతో ఆదాయం, ఉపాధి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై మంగళవారం జరిగిన సమీక్షలో, రాష్ట్రంలో 1,938 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రాన్ని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్