ఏపీలో రైతులకు ఈ నెల 15వ తేదీ నుంచే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల పంపిణీని వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కువ పంటలను ప్రకృతి సేద్య విధానంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, అలాగే మొక్కజొన్న ఆధారంగా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.