ఏపీ మంత్రిమండలి తాజాగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో రైతు పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలను జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రక్రియకు సుమారు రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు హక్కు కల్పించేలా కొత్త పాసుపుస్తకాలను జారీ చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.