గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ కీలక నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ హనీఫ్ అల్లుడు జావేద్, ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న జావేద్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, అటవీ శాఖ సెక్షన్ ఆఫీసరుగా, ఆపై ఎంపీడీఓగా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆయన ఎంపికతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.