AP: రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్‌ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.