జూనియర్‌ లాయర్ల స్టై ఫండ్‌ రూ.10వేలకు పెంపు!

AP: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లాయర్లకు నెలకు ఇచ్చే స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామన్నారు. అంతేకాకుండా, లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ, 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్