తుపాను బాధితులకు న్యాయం చేయాలి: పవన్ కళ్యాణ్ (VIDEO)

AP: కాకినాడ జిల్లాలో మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన చేకూర్చి, న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంట, ఆస్తి నష్ట అంచనాలను పకడ్బందీగా రూపొందించి, ప్రకటించిన సాయం అందరికీ అందేలా చూడాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గ తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై నివేదికలు పంపాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్