బద్వేల్: వసతి గృహాల్లో నాణ్యత లోపం.. ఫుడ్ కమిషనర్ ఆగ్రహం

బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రభుత్వ వసతి గృహాలు, కస్తూర్బా బాలికల వసతి గృహం, అంబేద్కర్ గురుకుల పాఠశాల, నరసన్నపల్లె రేషన్ షాపులను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహాలలో భోజనం నాణ్యత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల నోరు కొట్టేలా వ్యవహరిస్తే సహించబోమని, ప్రభుత్వం మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్