బద్వేల్ రేషన్ కార్డులో తప్పులుంటే సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు బద్వేల్ కమిషనర్ నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. పుట్టిన తేదీ, లింగం, బంధుత్వం వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే, వాటిని సచివాలయంలోని డేటా సెక్రటరీ ద్వారా సవరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.