వేపరాలలో తాగునీటి సమస్య

మైలవరం మండలం వేపరాల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామంలోని నాలుగు బోర్లలో రెండు పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం పక్క ఊళ్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, అధికారులు వెంటనే స్పందించి బోర్లకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్