అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, జమ్మలమడుగు పరిధిలోని గూడెం చెర్వు కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాన్ని డీఎస్పీ వెంకటేశ్వర రావు, సీఐ నరేష్ బాబు సాయంత్రం సందర్శించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, పాఠశాల, కళాశాల, వసతి గృహంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టాలని వసతి గృహ సంరక్షకురాలికి సూచనలు చేశారు.