ఆగస్టు 1న జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం గండికోట పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్, వ్యూపాయింట్, గార్జ్, కోట పరిసరాలు, గ్లాంపింగ్ టెంట్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పర్యాటక శాఖ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.