ఆళ్లగడ్డ-జమ్మలమడుగు రోడ్డులో ఎర్రమట్టి కుంగిపోవడంతో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో ఆళ్లగడ్డ నుండి జమ్మలమడుగు వెళ్లే సింగిల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎర్రమట్టి వర్షానికి కుంగిపోవడంతో, అధిక లోడ్‌తో వస్తున్న లారీలు, ఇసుక టిప్పర్లు, ఆర్టీసీ బస్సులు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. దీని కారణంగా దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ మార్గంలో ప్రతిరోజూ జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, పులివెందుల డిపోల బస్సులు తిరుగుతుంటాయి. ఈ సమస్యను R&B అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ప్రయాణికులు, కందుకూరు ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్