ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు గుదిబండలుగా మారాయి. రైల్వే స్టేషన్, క్వార్టర్స్ నుంచి రూ. 70 లక్షలు, కరెంట్ ఆఫీస్, సబ్ స్టేషన్ నుంచి రూ. 50 లక్షలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి మొత్తం రూ. 3.40 కోట్ల పన్ను బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 3.15 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 2.34 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు.