కడప: పోలీసు గ్రీవెన్స్‌కు 112 పిటిషన్లు

కడప ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అందిన 112 ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సుధాకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్