కడప రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని సీపీఎం డిమాండ్

కడప నగరం ఎర్రముక్కపల్లి - విశ్వనాధపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్, రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్చార్జి డిఆర్ఓ వెంకటపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్రిడ్జి పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే పూర్తి చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్