కడపలోని ముత్తురాసపల్లిలో పేరుకుపోయిన చెత్తపై స్థానికుల ఫిర్యాదుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి వెంటనే స్పందించారు. మున్సిపల్ అధికారులను ఆదేశించి యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించారు. నగర పరిశుభ్రతలో రాజీ లేదని, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని ఆమె సూచించారు. ఎమ్మెల్యే చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.