కమలాపురం ఆసుపత్రి సిబ్బంది గొడవపై దర్యాప్తు

కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మధ్య తలెత్తిన వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఆర్బీఎస్కే పీవో ఆరిపుల్ల, మహమ్మద్ తహా సిబ్బందిని విడివిడిగా విచారించి వివరాలు సేకరించారు. సెలవుల వంటి చిన్న విషయాలకు గొడవపడటం బాధాకరమని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలు, ఫార్మసీ, ల్యాబ్, పడకలను పరిశీలించి, ఘటనపై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్