కడప కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనాని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జేసీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనా పరమైన అంశాలపై వారిద్దరూ క్లుప్తంగా చర్చించుకున్నట్లు సమాచారం.