కడపలో పెండింగ్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు: సీపీఎం, సాధన కమిటీ డిమాండ్

కడప నగరం విశ్వనాధపురం వద్ద పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీపీఎం పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్, రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాడు కడప నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ, పరిహారం సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. భూసేకరణ పూర్తిచేసి రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్