ఎర్రగుడిపాడులో డ్రైనేజీ దుస్థితిపై ప్రజల ఆవేదన

కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో డ్రైనేజీ నీరు సిమెంట్ రోడ్డుపై నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఇళ్ల వద్దకు చేరడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్