మంగళవారం, వల్లూరు మండలంలో కొనసాగుతున్న జనగణనను జిల్లా రెవెన్యూ అధికారి మురళి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా వంద శాతం పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఏ ఒక్క కుటుంబం మిగిలిపోకుండా ప్రతి ఒక్కరినీ నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. వలస వెళ్లిన వారి ఇళ్లు, తాళం వేసిన గృహాల వివరాలను ఇరుగుపొరుగు ద్వారా పక్కాగా సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘురాం, తహసీల్దార్ శ్రీవాణి పాల్గొన్నారు.