హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం: డీఎస్పీ పావని

మదనపల్లి డీఎస్పీ పావని మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారునికి ప్రాణరక్షణ కవచమని తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ గురునాథ్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడే కీలక సాధనమని ఆమె వివరించారు. కార్యక్రమంలో భాగంగా దాతలు సమకూర్చిన 100 హెల్మెట్లను వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్