కురబలకోట: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: డీఎస్పీ

శనివారం కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, నేరాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి, సీఐ, ఎస్ఐలతో పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. ప్రజలతో పోలీసులు సన్నిహితంగా ఉండాలని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్