ఎన్‌హెచ్-71 రహదారి పనుల్లో పెండింగ్‌లో ఉన్న పరిహార చెల్లింపుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె మండలం వెంకప్పకోట గ్రామ పరిధిలో సబ్ కలెక్టర్, ఎన్‌హెచ్ సైట్ ఇంజినీర్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూస్వాధీనం వల్ల ప్రభావితమైన రైతులకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఆలస్యం లేకుండా పరిహారం అందేలా చూడాలని, రహదారి పనులను వేగవంతం చేయాలని జేసీ సూచించారు.