మదనపల్లి కేంద్రంగా నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాల అభివృద్ధికి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్వాగతం పలికిన అనంతరం కలెక్టరేట్ ను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి సూచనలు అందించారు.