మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం

మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన అన్వర్ బాషా రాయచోటికి బదిలీ అయ్యారు. టూ టౌన్ ఎస్ఐగా ఉన్న రహీముల్లాను వన్ టౌన్‌కు బదిలీ చేయగా, చౌడేపల్లి నాగేశ్వరరావును టూ టౌన్ ఎస్ఐగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రహీముల్లా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్