మదనపల్లి: కూల్ లిప్ విక్రయిస్తే కఠిన చర్యలు

మాదకద్రవ్యాల వినియోగంపై 'జీరో టోలరెన్స్'తో వ్యవహరించాలని, డ్రోన్లతో నిఘా పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ధీరజ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో, పాఠశాలల వద్ద నికోటిన్ పదార్థాల విక్రయాలను అరికట్టాలని, ఎన్జీవోల సమన్వయంతో వెంటనే వ్యసన విముక్తి కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 600 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, శిక్షణ పొందిన కుక్కలతో బస్టాండ్లలో తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్