మదనపల్లి: ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కిట్లు పంపిణీ

మదనపల్లెలో తీవ్ర ఎండల నేపథ్యంలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రత్యేక చర్యలు శుక్రవారం చేపట్టారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి గాగుల్స్, తెల్లటి టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లు, రెండు జతల యూనిఫామ్‌లతో కూడిన వేసవి రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తగినంత నీరు, ఓఆర్ఎస్ తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్