మదనపల్లిలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, భద్రత, విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను ప్రతిరోజూ పరిశీలించడం, తాగునీటి పరీక్షలు, పారిశుధ్యం, దోమల నివారణ, సీసీ కెమెరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా ట్యూటర్ల నియామకం, వారాంత పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.