అన్నమయ్య ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 'మీ భద్రత – మా బాధ్యత' పేరుతో మహిళా భద్రతపై అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుల్లో పోలీస్ అధికారులు మహిళలకు సైబర్ మోసాలు, చైన్ స్నాచింగ్స్ పట్ల అప్రమత్తత, కుటుంబ వివాదాల పరిష్కారంపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో 'డయల్ 112' మరియు 'శక్తి యాప్' ద్వారా తక్షణ సహాయం పొందాలని సూచించారు. ఈ సదస్సుల్లో 300 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.