చాపాడు మండలంలోని విశ్వనాధాపురం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతమని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుబ్బరత్నమ్మ తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. బిడ్డపుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టించాలన్నారు. దీంతో పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. 6 నెలలు నిండిన చిన్నారులకు తల్లి పాలతోపాటు పోషక పదార్థాలు అందివ్వాలన్నారు.