దువ్వూరు కేజీబీవీ వంటశాలలో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీ

దువ్వూరులోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఆయన పాఠశాల వంటశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఆహార తయారీ విధానం, భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్