మైదుకూరు: హైవేపై రాంగ్ రూట్ ప్రమాదాల నివారణకు సూచికలు

మైదుకూరు హైవేపై కొందరు వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ఈ ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అర్బన్ సీఐ కె. రమణారెడ్డి మాట్లాడుతూ, హైవేపై ప్రత్యేక హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేయించామని తెలిపారు. వాహనదారులంతా బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్