మైదుకూరు: విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు

వైద్య అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. శనివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో వైద్యులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్