మైదుకూరు తహశీల్దార్ కార్యాలయంలో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు 'రెవెన్యూ క్లినిక్' (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ రాజసింహ నరేంద్ర తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కడపకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే వినతులు ఇస్తే ఆన్ లైన్ ద్వారా కలెక్టర్ కి పంపిస్తామని ఆయన చెప్పారు. మండల అధికారులందరూ పాల్గొనే ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.