రోడ్డు పనులు నిలిచిపోవడంతో బురదలో నిరసన తెలిపిన మహిళలు, విద్యార్థులు

చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో రోడ్డు పనులు నెలల తరబడి నిలిచిపోవడంతో గ్రామం బురదమయమైంది. అత్యవసరాలకు అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం మహిళలు, విద్యార్థులు రోడ్డుపై బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. "మాకు దారి చూపించండి. మా ఓట్లే మీకు కావాలా?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్