అన్నమయ్య: కట్టుదిట్టమైన భద్రత మధ్య బక్రీద్‌ నిర్వహణ - ఎస్పీ

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా శాంతి సామరస్యాలు నెలకొనేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక నిఘా, మొబైల్ పెట్రోలింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. బుధవారం ఆయన సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్