స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి అమర్నాథ్ రెడ్డి బుధవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. యూనిఫై ఫ్యామిలీ సర్వేలో మిస్సింగ్ డేటాను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అవగాహన పెంచుతూ, జనగణన, స్వయం ఉపాధి సర్వేలను వేగవంతం చేసి 10% పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 82 వేల కుటుంబాలకు సేవలు అందించగా, మరిన్ని 4, 72, 000 కుటుంబాలకు చేరుకునే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.