జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం శుక్రవారం పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించింది. గ్రామసభల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, మహిళల భద్రత, బాల్యవివాహాల నివారణ, చైన్‌స్నాచింగ్‌పై అప్రమత్తత గురించి సూచనలు ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఆన్‌లైన్, ఓటీపీ మోసాలపై జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.