బద్వేల్: ఇకపై ఒకరికి 2 లీటర్ల పెట్రోలే

బద్వేల్ డివిజన్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డిఓ చంద్రమోహన్ 35 పెట్రోల్ బంకులకు ఇన్ఛార్జ్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టూ వీలర్లకు 2 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్ల ఇంధన పరిమితి విధించారు. డ్రమ్ములో విక్రయాలు, ఫుల్ ట్యాంక్ నింపడాన్ని నిషేధించారు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్డిఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్