ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 76 మంది పారిశుధ్య కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు అందలేదు. ఈ సమస్యపై వారు యూనియన్ నాయకుడు రాఘవ అధ్యక్షతన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. శాశ్వత ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు అందుతున్నాయని, తమకు మాత్రం జీతాలు నిలిపివేయడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని వారు కోరారు.