వేంపల్లె మండల నూతన వ్యవసాయ శాఖ అధికారిగా బాలగంగాధర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పులివెందుల ఏడీఏ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా, వేంపల్లె మండల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు నూతన అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఇంతకుముందు బాధ్యతలు నిర్వహించిన ఏఓ శివశంకర్ రెడ్డిని సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.