పులివెందుల నూతన డీఈగా నాగేంద్ర

పులివెందుల విద్యుత్ డివిజన్ కార్యాలయంలో బుధవారం నూతన డివిజనల్ ఇంజనీర్ గా నాగేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల డీఈ ప్రసాద్ రెడ్డి తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో వేంపల్లెలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర పదోన్నతి పొంది డీఈగా నియమితులయ్యారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులకు న్యాయం చేస్తానని నాగేంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్