ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిదని తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డి అన్నారు. సోమవారం పులివెందుల టిడిపి కార్యాలయంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు జోగిరెడ్డి, టిడిపి నాయకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి అందజేశారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన 46 మంది లబ్దిదారులకు రూ. 32, 73, 335 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో లింగాల మండలం నాయకులు గడ్డం అమర్ ఉన్నారు.