పులివెందులలోని భారత్ పెట్రోల్ బంకును మంగళవారం సందర్శించిన ఆర్డీవో చిన్నయ్య, పెట్రోల్ బంక్ యజమానులకు ఇష్టారాజ్యంగా పెట్రోల్ ధరలు నిర్ణయించవద్దని, అందరికీ ఒకే విధంగా పెట్రోల్ పట్టాలని సూచించారు. రిజిస్టర్లను పరిశీలించి, పెట్రోల్ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ పట్టే విషయంలో పక్షపాతం చూపరాదని సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.