అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం లో గత నెల 14న పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నాలుగు మృతుల కుటుంబాలకు శుక్రవారం సాయంత్రం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా చెక్కులు కలెక్టర్ చామకూరి శ్రీధర్, కుడా చైర్మన్ ముక్క రూపనంద్ రెడ్డి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.