పెనగలూరు: దురలవాట్లకు దూరంగా ఉండాలి: ఎస్సై

డ్రగ్స్ కు మరియు మత్తు పానీయాలకు బానిసలు అయితే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి చేరుకుంటారని పెనగలూరు ఎస్సై బీ. రవి ప్రకాశ్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం పెనగలూరు ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ మహేశ్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన శక్తి టీం, రోడ్డు భద్రత నియమాల గురించి వివరించారు. సోషల్ మీడియా, వాట్సప్, స్నేహితులు చెప్పే వక్రపు సూచనలు పాటిస్తూపోతే జీవితమే వ్యర్థమైపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్