అన్నమయ్య జిల్లా కోడూరు పట్టణంలో ప్రధాన రోడ్లను ఈవో ప్రసాద్ రావు సందర్శించారు. ఇల్లు, షాపుల నుంచి చెత్త రోడ్లపై పడేస్తే జరిమానా విధిస్తామని గురువారం హెచ్చరించారు. షాపు యజమానులు రోడ్లపై చెత్త వేస్తే రూ.2000 జరిమానా విధిస్తామని తెలియజేశారు. చెత్త సేకరణ వాహనాలు సకాలంలో రాకపోతే 6301438066 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.